రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంకా ఇలాంటి వాతావరణమే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం తథ్యమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ మహా పిరికి అని విరుచుకుపడ్డారు. బైడెన్ ఎంత పిరికి అయినా ఇన్ని అసమర్థతలు ఉన్నా అమెరికా సైనికుల రక్తం చిందించకుండా, రష్యా ఉక్రెయిన్ల మధ్య పరిస్థితిని చక్కదిద్దే సమయం ఇంకా వుందని అన్నారు. బైడెన్ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని, ఆంక్షల పరంపర కొనసాగిస్తూనే వుండాలని ట్రంప్ సూచించారు. పరిస్థితి ఇలాగే వుంటే మూడో ప్రపంచ యుద్దం తథ్యమని, అయితే తాను మాత్రం యుద్దానికి పూర్తి వ్యతిరేకమని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)