Namaste NRI

అదే జరిగితే మాపై యుద్ధం ప్రకటించినట్లే

ఉత్తర కొరియా మరోసారి అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ క్షిపణులను అడ్డుకుంటే యుద్ధం ప్రకటించినట్టేనని ఉత్తరకొరియా దేశాధినేత కిమ్ జాంగ్ చెల్లెలు కిమ్ యో జోంగ్ తెలిపారు.  తన సోదరుడి బాటలోనే, తాజాగా అగ్రరాజ్యం అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం చెప్పారు. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే, అది ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించినట్టుగానే భావిస్తామని కిమ్ యో జోంగ్ స్పష్టం చేశారు. ఉత్తర కొరియా వ్యూహాత్మకంగా క్షిపణి పరీక్షలు చేపడుతోందని, అందుకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టే ఎలాంటి సైనిక చర్య అయినా అది యుద్ధ ప్రకటనే అవుతుందని తేల్చి చెప్పారు. తమను తక్కువ అంచనా వేయొద్దని, పసిఫిక్ మహాసముద్రంలోకి పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగించగలమని వార్నింగ్ ఇచ్చారు.

వాస్తవానికి ఇప్పటివరకు అమెరికా మిత్ర దేశాలు ఏనాడూ ఉత్తర కొరియా క్షిపణిని కూల్చివేయలేదు. కాకపోతే ఇటీవల కాలంలో జపాన్ సముద్రం పైకి తరచూ ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగించడం ఆందోళనకరంగా మారింది. దీంతో ఈ వాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికే అమెరికా బి52 బాంబర్లు దక్షిణ కొరియా విమానాలతో కలిసి పలుమార్లు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. దీంతోపాటు వచ్చేవారం నుంచి ఫ్రీడమ్ షీల్డ్ పేరిట 10 రోజులు యుద్ధ విన్యాసాలు నిర్వహించేందుకు ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events