Namaste NRI

ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోతే.. నేను ఇక్కడకు రాను

సిద్ధార్థ్‌  కథానాయకుడిగా నటించి, నిర్మించిన సినిమా చిన్నా. అంజలి నాయర్‌, సజయన్‌ ముఖ్యపాత్రలు. ఎస్‌.యు. అరుణ్‌కుమార్‌ దర్శకుడు. తమిళంలో చిత్త పేరుతో విడుదలై బాగా ఆడుతున్న ఈ సినిమాను చిన్నాగా తెలుగులో విడుదల చేస్తున్నారు.  ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిద్ధార్థ్‌ మాట్లాడారు.  చిన్నా సినిమాను తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పుడు సిద్ధార్థ్‌ సినిమాలు ఎవరు చూస్తారు? అంటూ కొందరు హేళనగా మాట్లాడారు. ఈ రోజు చెబుతున్నాను వినండి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోతే ఇక నేను ఇక్కడకు రాను. ప్రెస్‌మీట్లు పెట్టను అని భావోద్వేగానికి లోనయ్యాడు హీరో సిద్ధార్థ్‌.

 బాబాయి, కూతురు మధ్య ఉండే అనుబంధమే ఈ సినిమా. ఇలాంటి కథలో చేయాలనేది నా 22ఏళ్ల కల. ఇన్నాళ్లకు నెరవేరింది. నా కెరీర్‌లో ఇదే బెస్ట్‌ మూవీ. నేనింకా నటుడిగా ఎందుకు కొనసాగాలో ఈ సినిమా చెబుతుంది. తమిళంలో ఆదరిస్తున్నారు. తెలుగులో కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న ఏషియన్‌ సునీల్‌గారికి థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నా. ఈ సినిమా నా జీవితం. సినిమాపై నమ్మకం, ఇష్టం ఉంటే థియేటర్‌కెళ్లి సినిమా చూడండి. ఈ సినిమా చూశాక కూడా నచ్చకపోతే ఇక తెలుగులో కనిపించను. ఈ 22ఏళ్ల నా కెరీర్‌లో సిద్ధార్థ్‌ బయటవాడు అనే మాట తెలుగునేలపై రాలేదు. రాదనే అనుకుంటున్నా అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events