Namaste NRI

దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే… అది కేసీఆర్ మాత్రమే

దేశ చరిత్రలో మాట తప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముమ్మాటికి సీఎం కేసీఆర్‌ మాత్రమేనని ఎన్నారై శాఖ వ్యవస్థాపన అధ్యక్షుడు కూర్మాచలం అనిల్‌ అన్నారు. ఉద్యోగ నియామకాలు ప్రకటించడంపై ఎన్నారైల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. నేడు మరో 91,142 పోస్టులను భర్తీ చేయబోతున్నదని అన్నారు. నూతన ఉద్యోగాల భర్తీతో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి నేటి వరకు అన్ని వర్గాల ప్రజలకు సరైన సందర్భంలో న్యాయం చేస్తూ దేశానికే ఆదర్శ నాయకుడిగా నిలుస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు మన నీళ్లు, మన నిధులు, సంక్షేమ పథకాల ద్వారా  ప్రజల వద్ద చేరుతున్నాయన్నారు.  రాష్ట్రంలోని నిరుద్యోగులు, ప్రజలే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలంతా హర్షిస్తున్నారని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events