రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ గత నెల రోజుల్లో యుద్ధంలో దాదాపు 25 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.

రక్తపాతం ఆగిపోవాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. గత నెలలో 25 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో ఎక్కువమంది సైనికులే ఉన్నారని తెలిపారు. బాంబులవల్ల మరికొందరు చనిపోయారని, ఇది వెంటనే ఆగిపోవాలని, అందుకు తాము చాలా కష్టపడి పనిచేస్తున్నామని అన్నారు. ఇలాంటి పోరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని, అది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు.















