Namaste NRI

ఇలా అయితే భారత్‌లో.. వాట్సాప్‌ ఉండదు

గోప్యతను వదిలేయాల్సి వస్తే వాట్సాప్‌ భారత్‌ నుంచి బయటకు వెళ్లిపోతుందని మెటా సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఐటీ రూల్స్‌ – 2021లోని 4(2) నిబంధనను సవాల్‌ చేస్తూ వాట్సాప్‌ యాజమాన్య సంస్థ మెటా  ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఏదైనా పోస్ట్‌ లేదా సమాచారం మొదట ఎవరి వద్ద నుంచి వచ్చిందనేది సోషల్‌ మీడియా సంస్థలు గుర్తించాలని ఈ నిబంధన చెప్తున్నది. అయితే, ఇలా చేయాలంటే కోట్లాది మెసేజ్‌ లను ఏండ్ల తరబడి స్టోర్‌ చేయాల్సి ఉంటుందని వాట్సాప్‌ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎండ్‌ టూ ఎండ్‌ ఎంక్రిప్షన్‌ (ఎక్కడా మెసేజ్‌ స్టోర్‌ కాకుండా నేరుగా పంపించిన వారి నుంచి అందుకునే వారికి వెళ్లడం) విధానానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ఎండ్‌ టూ ఎండ్‌ ఎంక్రిప్షన్‌ వల్ల గోప్యత ఉంటుం దనే నమ్మకంతోనే వినియోగదారులు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారని, దీనికి భంగం కలిగే పరిస్థితే వస్తే తమపై వినియోగదారుల నమ్మకం దెబ్బతింటుందని వివరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events