విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ జంటగా అను ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం జోరుగా హుషారుగా. నిరీష్ తిరుమీధుల నిర్మాత. ఈ సినిమాలోని రఫ్పా రఫ్పా రఫ్పాడిస్తే అనే గీతాన్ని హీరో నాని విడుదల చేశారు. దర్శకుడు అను ప్రసాద్ మాట్లాడుతూ యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో విరాజ్, పూజిత, బెక్కెం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.














