అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో వెల్లడిరచారు. టెక్సాస్‌లో పర్యటిస్తున్న ట్రంప్ ఈ సందర్భంగా వ్యాక్సిన్ల గురించి మాట్లాడారు. వ్యాక్సిన్ల వల్లే కోట్లాది మంది ప్రాణాలను రక్షించుకోగలిగామన్నారు. వ్యాక్సిన్ క్రెడిట్‌ను మనమే తీసుకోవాలని, మీరు టీకా వద్దు అనుకుంటే, తీసుకోకండి. కానీ టీకాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు దక్కాయని ట్రంప్ అన్నారు. తన మద్దతుదారులు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ట్రంప్ కోరారు. వ్యాక్సిన్లను రూపొందించి చరిత్ర సృష్టించామని అన్నారు. అమెరికాలో మూడు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రత్యర్థి పార్టీలకు ఆ క్రెడిట్ దక్కేలా ప్రవర్తించవద్దు అని తన మద్దతుదారులకు ట్రంప్ తెలిపారు.
అమెరికాలో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు ఆ వేరియంట్ డామినెంట్‌గా మారింది. 73 శాతం కేసులు అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్‌వే నమోదు అవుతున్నాయి.














