ఉక్రెయిన్‌పై యుద్దాన్ని తీవ్రతరం చేసిన రష్యా కీన్‌ను స్వాదీనం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. అధ్యక్షుడు జెలెన్స్కీని అంతమొందించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరణిస్తే ఏం చేయాలన్న దానిపై ప్లాన్స్ సిద్ధంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ వెల్లడిరచారు. తాను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో మాట్లాడానని, అనుకోని ఏదైనా జరిగే ప్రత్నామ్నాయ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ వివరాలను తాము ఇప్పుడు బయటకు చెప్పలేనన్నారు. రష్యా చేతిలో తమ దేశాధ్యక్షుడు హత్యకు గురైనప్పటికీ ప్రభుత్వం కొనసాగేలా ఉక్రెయిన్ ప్రజలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు తగిన ప్రణాళిక ఉందని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు హత్యకు క్రెమ్లిన్ మద్దతున్న వాగ్నర్ గ్రూప్‌తో పాటు చెచెన్ స్పెషల్ ఫోర్స్ పలుమార్లు ప్రయత్నించినట్లు ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడిరచింది.
……………………..