అమెరికా, ఐరోపా సమాఖ్యలు రష్యాపై ఆంక్షలు విధించడం సరికాదని చైనా ప్రధాని లీ కెకియాంగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ 19 నుంచి కోలుకోవాల్సిన తరుణంలో ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు నానాటికీ మరింత తీవ్రంగా క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఆ దేశం నాటోలో చేరడం వల్ల రష్యాకు ఎదురయ్యే ఆందోళనలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఉక్రెయిన్‌లో శాంతి, స్థాపనకూ, అభివృద్ధి, సుస్థిరతల సాధనకూ కృషి చేస్తామన్నారు. ఇందుకు సబంధించిన ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందన్నారు.














