Namaste NRI

ఆకట్టుకుంటున్న ఆనంద్‌ దేవరకొండ హైవే పోస్టర్‌

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హైవే. మానస రాధాకృష్ణన్‌ కథానాయిక. ఆనంద్‌ పుట్టిన రోజు సందర్భంగా హైవే పోస్టర్‌ని విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ఆనంద్‌ ఓ కొండరాయిపై కూర్చొని చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించారు. ఈ పోస్టర్‌ ద్వారా ఆనంద్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పింది చిత్ర యూనిట్‌. భిన్నమైన  సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌. కథలో కీలక భాగం అంతా హైవే పైనే సాగుతుంది. అందుకే ఈ సినిమాకి ఆ టైటిల్‌ పెట్టాం. ఆనంద్‌ కెరీర్‌లో మరో కొత్త తరహా సినిమా అవుతుంది. చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలోనే విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. అభిషేక్‌ బెనర్జీ, సయామీ ఖేర్‌, సత్య, జాన్‌ విజయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం : సైమన్‌ కె.కింగ్‌. గుహన్‌ దర్శకుడు. వెంకట్‌ తలారి నిర్మాత.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events