Namaste NRI

గూగుల్‌కు పోటీగా.. చాట్‌జీపీటీలో

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఓపెన్‌ ఏఐ సంస్థ తన జనరేటివ్‌ ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ లో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గూగుల్‌కు పోటీగా సెర్చ్‌ ఫంక్షన్‌ను జోడించింది. చాట్‌జీపీటీ సెర్చ్‌ అని పిలిచే ఈ కొత్త ఫీచర్‌తో ఓపెన్‌ఏఐ నేరుగా గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌కు పోటీ ఇవ్వనున్నది. ప్రస్తుతం చాట్‌జీపీటీ పెయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కొత్త ఫీచర్‌ను క్రమంగా చాట్‌జీపీటీ వినియోగదారులందరికీ అందుబాటులోకి తెస్తామని ఓపెన్‌ఏఐ ప్రకటించింది.

జీపీటీ-4ఓ ఫైన్‌-ట్యూన్డ్‌ వెర్షన్‌ అయిన ఈ సెర్చ్‌ మాడల్‌ను చాట్‌జీపీటీ ప్లస్‌, టీమ్‌ వినియోగదారులంతా యాక్సెస్‌ చేయగలుగుతున్నట్టు వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా వినియోగదారులు ఇకపై వెబ్‌లింక్స్‌తో కూడిన రియల్‌-టైమ్‌ సమాచారాన్ని తక్షణమే పొందవచ్చని, గతంలో మాదిరిగా సెర్చ్‌ ఇంజిన్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండబోదని వివరించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events