
ఫిలిప్పీన్ రాజధాని మనీలాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక మురికివాడలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో వెయ్యికి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. భారీగా ఎగసి పడ్డ మంటలు, దట్టమైన పొగలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ప్రమాదానికి కారణం తెలియరాలే దు. అయితే ఒక ఇంటిలోని రెండో అంతస్తులో ఏర్పడిన మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయని స్థానికులు కొందరు తెలిపారు. అగ్నిమాపక, ఇతర రక్షక బృందాలు మంటలను ఆర్పుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించ లేదని, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక నష్టాన్ని అంచనా వేస్తామని అధికారులు తెలిపారు.
