తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని, కేసీఆర్‌కు తిరుగులేదని మూనుగోడు ప్రజలు మరోసారి చాటారని ఎన్‌ఆర్‌ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునుగోడు గెలుపుతో 2023లో టీఆర్‌ఎస్ హాట్రిక్ విజయం ముందే ఖారరైందని అన్నారు. మునుగోడును గెలిచేందుకు బీజేపీ మొక్కని మొక్కు, దిక్కు లేదని చెప్పని అబద్ధం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌పై కుట్రకు దిగిన కోమటిరెడ్డి సోదరుల రెంటికి చెడ్డ రేవడిలా తయారయిందన్నారు. టీఆర్‌ఎస్‌ను కేసీఆర్ ఒక్కడిగా మొదలుపెట్టినా నేడు 65 లక్షలకు పైగా కార్యకర్తలు బలంగా ఉన్న పార్టీగా ఎదిగిందని తెలిపారు. రోజురోజుకూ పార్టీ బలం పెరుగుతూనే ఉన్నదని, ఇప్పుడు జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందన్నారు.