టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆదేశాల మేరకు న్యూజిలాండ్‌లో దీక్ష దివస్ ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా దీక్షా దీవస్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలని, జ్ఞాపకాలను పోరాటలను స్మరించుకున్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ జగన్ పడ్నాలా మాట్లాడుతూ నేడు మనం తెలంగాణ పౌరునిగా తల ఎత్తుకొని తిరుగుతున్నాం అంటే అది కేసీఆర్ దీక్షా ఫలితమే అన్నారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ శాఖ ద్వారా సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కోస్నా, కళ్యాణ్ కసుగంటి, అరుణ్ ప్రకాష్ రెడ్డి, రామారావు రాచకొండ, కిరణ్ పోకల, మౌనిక కొలిపాక, పానుగంటి శ్రీనివాస్, మోహన్ రెడ్డి, సింహ రావు ఏనుగంటి, వరుణ్ రావు పాల్గొన్నారు. న్యూజిలాండ్‌లో దీక్షా దివస్ ని నిర్వహించిన బృందానికి మహేష్ బిగాల అభినందించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)