పొరుగు దేశం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. దేశ ఆర్థిక పరిస్థితి గాడిన పెట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ నేత ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌లో నెలకొన్న పరిస్థితుల్ని భారత్‌తో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంచలంచలుగా అభివృద్ధి చెందుతున్న భారత్ తీరును కొనియాడారు.
పాకిస్థాన్‌లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించారు. పొరుగు దేశం భారత్ ప్రపంచ సూపర్ పవర్ గా మారేందుకు ప్రయత్నిస్తుంటే, మనం మాత్రం దివాలా తీయ కుండా ఐఎంఎఫ్‌ని నిధులు అడుక్కుంటున్నాం అంటూ వ్యాఖ్యానించారు. పొరుగు దేశం భారత్‌తో మనల్ని పోల్చుకోండి. ఆగస్టు 1947లో రెండు దేశాలూ ఓకే రోజు స్వాతంత్రం పొందాయి. ఈ రోజు భారత్ ప్రపంచ సూపర్ పవర్‌గా మారాలని కలలు కంటోంది. మనం మాత్రం దివాలా తీయకుండా ఉంటే చాలని ప్రయత్నిస్తు న్నాము. ఈ పరిణామాలకు బాధ్యులెవరు? అంటూ పాక్ ఆర్థిక పరిస్థితిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.