దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా సైన్యం అమ్ములపొదిలో మరిన్ని ఆయుధాలు చేరాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలు, సాంకేతిక వ్యవస్థలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీకి అందజేశారు. ప్యూచర్ ఇన్ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఏ సిస్టమ్ (`), కొత్త తరం యాంటీ పర్సనల్ మైన్ నిపున్, ఆటోమెటిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, ట్యాంకులకు ఆధునీకరించిన సైట్ సిస్టమ్, అడ్వాన్స్డ్ థర్మల్ ఇమేజర్స్‌తో పాటు ఇన్ఫాంట్రీ ప్రొటెక్టెడ్ వెహికల్స్, ల్యాండిరగ్ క్రాఫ్ట్ అసల్ట్ బోట్స్‌ను రాజ్‌నాథ్ అందజేశారు. ఈ పరికరాలు/ వ్యవస్థలను ఆత్మనిర్బర్ భారత్ అభియాన కార్యక్రమం కింద డీఆర్డీవో, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ సహకారంతో ఆర్మీ అభివృద్ధి చేసింది. ఈ కొత్త ఆయుధాలతో భారత సైన్యం శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్యం సంసిద్ధంగా ఉండేలా దోహదపడతాయని రాజ్‌నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందులో కొన్ని పరికరాలను రాజ్‌నాథ్ నేరుగా ఆర్మీ అధికారులకు అందజేయగా, బోట్లు, డ్రోన్ వ్యవస్థలను వర్చువల్‌గా ఆర్మీకి అప్పగించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)