కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దీంతో భారత ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌పై దృష్టిసారింది. కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో ఘనత సాధించింది. దేశంలో అర్హులైన జనాభాలో 50 శాతం మందికి పైగా రెండు డోసుల కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాక మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అర్హతగల వారిలో 50 శాతానికి పైగా వయోజనులు రెండు డోసులు తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. మరో మైలుయిరాని చేరుకున్నందుకు భారతదేశానికి అభినందనలు తెలియజేశారు.
కరోనా మమహ్మారిపై పోరులో తామంతా కలిసే విజయం సాధిస్తామని ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం నాటిని దేశ వ్యాప్తంగా మొత్తం 127.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో 84.4 కోట్ల మంది ఇప్పటి వరకు కనీసం ఒక డోసు తీసుకున్నారని వివరించారు. ఇప్పటి వరకు 47:59 కోట్ల మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నారని తెలిపింది.