ఎన్నారైల కారణంగా భారత్‌కు ప్రపంచ దేశాల్లో ఉన్న పేరు ప్రఖ్యాతులు మరింత ఇనుమడిస్తాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అన్నారు. ట్విటర్ సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ ఎంపికైన నేపథ్యంలో నారాయణ మూర్తి స్పందించారు. కొద్ది మంది మాత్రమే విదేశాలకు వెళుతున్నారు. తాము ఎంచుకున్న రంగాల్లో అద్భుతాలు సాధిస్తున్నారు. దీని వల్ల భారత దేశ పేరు ప్రఖ్యాతలు మరింత ఇనుమడిస్తాయి. ప్రవాసీయుల భారతదేశ రాయబారుల వంటి వారు. విదేశాల్లో వారు విజయాలు సాధిస్తున్నందుకు ప్రశంసిస్తున్నాను. భారత్‌లోనే ఉండిపోవాలని చెప్పదలుచుకోలేదు అని ఆయన తాజాగా కామెంట్ చేశారు.