బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చే యూకే పౌరులకు భారతదేశం గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులు వ్యాక్సినేషన్ పూర్తయినా సరే పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న భారతీయులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడిరచింది. ఈ క్రమంలోనే భారత్ వచ్చే యూకే పౌరులు కూడా క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. విదేశీ ప్రయాణికులపై ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన నిబంధనలే యూకేకు కూడా వర్తిస్తాయని భారత ప్రభుత్వం వెల్లడిరచింది.