మొబైల్ మాల్‌వేర్ దాడుల్లో భారత్ టాప్‌లో నిలిచింది. గతంతో పోల్చితే భారత్ ర్యాంకింగ్ మరింత దిగజారిం ది. సైబర్ ముప్పు, బెదిరింపుల్లో అమెరికా, కెనడాలను భారత్ దాటిపోయిందని ద స్కేలర్ థ్రెట్ ల్యాబ్జ్-2024’ తాజా నివేదిక పేర్కొన్నది. డిజిటల్ పరివర్తన, పెరుగుతున్న సైబర్ బెదిరింపుల నేపథ్యంలో భారతీయ సంస్థలు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరముందని నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచంలో మొత్తం మొబైల్ మాల్‌వేర్ దాడుల్లో 28 శాతం భారత్‌లో చోటుచేసుకోగా, ఇది అమెరికాలో 27.3 శాతం, కెనడాలో 15.9 శాతంగా ఉంది.
జూన్ 2023 నుంచి మే 2024 మధ్యకాలంలో 2,000 కోట్ల మొబైల్ లావాదేవీలకు సంబంధించిన రిస్క్, సైబర్ బెదిరింపుల డాటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. మాల్‌వేర్ అన్నది కంప్యూటర్ వైరస్. వార్మ్స్, ట్రోజన్ హార్స్, రాన్సమ్‌వేర్, స్పైవేర్ మొదలైన హానికరమైన సాఫ్ట్‌వేర్ ప్రోగామ్స్‌ను యూజర్లకు తెలియకుం డానే వారి మొబైల్ ఫోన్లలోకి పంపుతారు. దీంతో ఆ మొబైల్ ఫోన్లలోని సున్నితమైన, వ్యక్తిగత డాటాను సైబర్ నేరగాళ్లు దొంగలిస్తారు.