
అజర్‌బైజాన్‌లో బాకు వేదికగా ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న వాతావరణ సదస్సులో కీలక ఒప్పందం కుదిరింది. వాడివేడిగా సాగిన చర్చల నడుమ 200 దేశాలు వాతావరణ ఒప్పందాన్ని ఆమోదించాయి. భూతాపాన్ని అరికట్టేందుకు సంపన్న దేశాలు, పేద దేశాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని తాజా ఒప్పందం 300 బిలియన్ డాలర్లకు(సుమారుగా రూ.25లక్షల కోట్లు) పెంచింది. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వచ్చే ఒప్పందానికి సంబంధించి ధనిక దేశాల ఆర్థిక సాయం 500 బిలియన్ డాలర్లకు పెంచాలన్న భారత్ సహా వివిధ దేశాల డిమాండ్ నెరవేరలేదు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను, తీవ్రతను పర్యావరణ ప్యాకేజ్ పరిష్కరించదని భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
