బ్రిటన్కు భారత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. భారత్కు వచ్చే బ్రిటన్ పౌరులు టీకా వేయించుకున్నప్పటికీ విధిగా పది రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అక్టోబర్ 4 నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. అక్టోబర్ 4 నుండి భారతదేశానికి వచ్చే బ్రిటన్ జాతీయులంతా, వారి టీకా స్థితితో సంబంధం లేకుండా, మూడు కోవిడ్ 19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల ముందు, విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, భారత్కు వచ్చి 8వ రోజు తర్వాత కరోనా టెస్ట్లు చేయించుకోవాలి. అలాగే భారతదేశానికి చేరిన తర్వాత ఇంట్లో లేదా గమ్యస్థాన చిరునామాలో తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని తెలిపింది. బ్రిటన్ ప్రభుత్వం కూడా ఇటీవల భారతీయ ప్రయాణికుల పట్ల ఇలాంటి ఆంక్షలు విధించింది.














