Namaste NRI

భారతీయుడు 2 ట్రైలర్‌ వచ్చేసింది

కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం భారతీయుడు-2. శంకర్‌ దర్శకుడు. ఎస్‌.జె.సూర్య, సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రియా భవానీశంకర్‌, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్‌, జయరాం, గుల్షన్‌ గ్రోవర్‌, సముద్రఖని, బాబీ సింహా, బ్రహ్మానందం, జాకీర్‌ హుస్సేన్‌, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.   ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. సిద్ధార్థ్‌ చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా మొదలైంది. వ్యవస్థ లోని అవినీతిని అరికట్టడానికి సేనాపతి తిరిగి రావాల్సిందేనని ప్రజలు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సేనాపతి ఎంట్రీ ఇస్తాడు. సేనాపతిగా కమల్‌హాసన్‌ విభిన్న గెటప్స్‌లో కనిపించారు. యాక్షన్‌, విజువల్స్‌ హైలైట్‌గా నిలిచాయి.

ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు,నేతాజీ మార్గంలో నేను. ఇక ఆట ఆరంభమైంది అంటూ సేనాపతి చెప్పిన డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. సీక్వెల్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పాత్రలో కమల్‌హాసన్‌ కనిపించనున్నారు. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, కెమెరా: రవివర్మన్‌, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ ప్రొడక్షన్స్‌, నిర్మాత: సుభాస్కరన్‌.

Social Share Spread Message

Latest News