అమెరికాలోని వాషింగ్టన్లో గాంధీజీ విగ్రహ ధ్వంసంపై భారతీయ అమెరికన్లు ఆందోళన చేపట్టారు. ప్రముఖ టైమ్ స్క్వేర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ద్వేషపూరిత నేరాలు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి కక్ష్య పూరిత నేరాలను అడ్డుకట్ట వేసేందుకు బైడెన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేరాల అడ్డుకట్టకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను సమీక్షించాల్సిన సమయం వచ్చిందన్నారు.