
కొత్త ఉద్యోగ నియామకాల కోసం భారతీయ కంపెనీల నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గిపోయినట్లు తెలిసింది. భారత్‌కు చెందిన కంపెనీల అమెరికన్ ఉద్యోగ నియామకాలు పెరగడం, టెక్నాలజీలో మార్పులు, అమెరికా వెలుపల ఉండి పనిచేసే అవకాశాలు తగ్గడం వంటివి కొత్త హెచ్-1బీ వీసాదారులకు డిమాండు తగ్గిపోవడానికి కారణాలుగా నిపుణులు తెలిపారు. గడచిన దశాబ్దకాలంతో పోలిస్తే భారత్‌కు చెందిన ఏడు దిగ్గజ కంపెనీల నుంచి హెచ్-1బీ వీసాదరఖాస్తులు 2025 ఆర్థిక సంవత్సరంలో 70 శాతం తగ్గింది.















