Namaste NRI

అమెరికాలో భార‌తీయుడికి రెండేళ్ల జైలుశిక్ష‌

అమెరికాలో భార‌తీయ వ్య‌క్తి మొహ‌మ్మ‌ద్ ఆసిఫ్ కోవిడ్ స‌మ‌యంలో మెడిక‌ల్ ఫ్రాడ్‌ కు పాల్ప‌డ్డాడు. ఆ కేసులో అమెరికా అటార్నీ ఛార్లెస్ నీల్ ఫ్లాయిడ్ ఆదేశాలు జారీ చేశారు. డ‌యాగ్న‌స్టిక్ ల్యాబ్ ద్వారా మెడికేర్‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన ఆసిఫ్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ల్యాబ్ ద్వార వ‌సూల్ చేసిన సుమారు 1.17 మిలియ‌న్ల డాల‌ర్ల డ‌బ్బును తిరిగి చెల్లించాల‌ని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది.

వాషింగ్ట‌న్‌లోని ఎవ‌రెట్‌లో అమెరిక‌న్ ల్యాబ్‌వ‌ర్క్స్‌ ఎల్ఎల్‌సీ డ‌యాగ్న‌స్టిక్ కేంద్రాన్ని ఆసిఫ్ న‌డిపారు. అయితే కోవిడ్ వేళ మెడికేర్ సంస్థ‌కు ల్యాబ్ సేవ‌లు అందించారు. కానీ ఆ స‌మ‌యంలో భారీ అవినీతికి అత‌ను పాల్ప‌డ్డాడు. అక్ర‌మ రీతిలో బిల్లులు వ‌సూల్ చేశాడు. హెల్త్ కేర్ ఫ్రాడ్ కేసులో ఆసిఫ్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. చికాగోలోని విమానాశ్ర‌యం నుంచి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించిన అత‌న్ని ప‌ట్టుకున్నారు. జైలుశిక్ష పూర్తి అయిన త‌ర్వాత అత‌న్ని డిపోర్ట్ చేయ‌నున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events