Namaste NRI

భార‌తీయ పౌరుల్ని రిక్రూట్ చేయ‌డం లేదు

త‌మ మిలిట‌రీ కోసం భార‌తీయ పౌరుల ను రిక్రూట్ చేసుకోవ‌డం లేద‌ని ర‌ష్యా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి మారియా జ‌ఖ‌రోవా తెలిపారు. ఉక్రెయిన్‌, ర‌ష్యా యుద్ధ క్షేత్రంలో భార‌తీయులు ఉన్న వీడియోలు వైర‌ల్ అవుతున్న నేప‌థ్యంలో వేసిన ఓ ప్ర‌శ్న‌కు ఆమె బదులిస్తూ ఆ వీడియోల గురించి త‌న వ‌ద్ద ఎటువంటి స‌మాచారం లేద‌ని తెలిపారు. భార‌తీయ రిక్రూట్మెంట్ విష‌యంలో ర‌ష్యా అధికారుల పాత్ర ఏమీ లేద‌ని ఆమె అన్నారు. ఒక‌వేళ ఎవ‌రైనా ఏదైనా స‌మాచారాన్ని అందిస్తే, దాని గురించి విచార‌ణ‌చేప‌ట్ట‌నున్న‌ట్లు జ‌ఖ‌రోవా తెలిపారు.

విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాంటూ హ్యూమ‌న్ ట్రాఫికింగ్‌కు పాల్ప‌డుతున్న న‌లుగుర్ని గ‌త వారం సీబీఐ అరెస్టు చేశారు. సోష‌ల్ మీడియా ఆధారంగా యువ‌త‌ను ఆక‌ర్షిస్తున్నార‌ని, ర‌ష్యాలో ఉద్యోగం క‌ల్పించ‌నున్న‌ట్లు చెబుతూ మోసం చేస్తున్నార‌ని తెలిసింది. ఇండియాలో రిక్రూట్ చేసి, ఆ త‌ర్వాత ఆ యువ‌త‌కు శిక్ష‌ణ ఇచ్చి, వాళ్ల‌ను యుద్ధ క్షేత్రంలోకి పంపిస్తున్నార‌ని సీబీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events