దీపావళి వేడుకలు భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఘనంగా జరిగాయి. భారత్, పాకిస్థాన్ భద్రతా బలగాలు స్వీట్లు పంచుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి తిథ్వాల్ వంతెనపై రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. ఇదే తరహాలో అట్టారీ`వాఘా సరిహద్దుతో పాటు గుజరాత్, రాజస్థాన్లో రెండు దేశాల సరిహద్దుల్లో సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రతి ఏటా హోలీ, దీపావళి, రంజాన్ పండుగల వేళ రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది.