Namaste NRI

భారత ప్రధాని మొదటి స్థానం… అమెరికా అధ్యక్షుడు 6వ స్థానంలో

భారత ప్రధాని మోదీకి ఉన్న క్రేజ్‌ భారత్‌లోనే కాదు యావత్‌ ప్రపంచమంతా వ్యాపించింది. మోదీ మరోసారి తన చరిష్మా చూపించారు.  2014 లో భారత్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నుంచి ఏటా తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటూనే వస్తున్నారు. తాజాగా నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో మొదటి స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ ఆయా దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో ప్రజలు ఈ మేరకు తమ అభిప్రాయాన్ని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానంలో నిలిచారు. ఈ సర్వే ప్రకారం మోదీ 70 శాతం ప్రజామోదంతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు.  మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ సర్వేలో గతేడాది కూడా మోదీనే మొదటి స్థానంలో నిలిచారు. ఈ సారి భారత్‌లో 2,126 మందిని ఆన్‌లైన్‌ ద్వారా ఈ సంస్థ సర్వే చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events