Namaste NRI

న్యూయార్క్‌లో భారతీయ విద్యార్థి మృతి

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారతీయుడు మృతి చెందాడు. భారత్‌కు చెందిన ఫజిల్ ఖాన్ అనే యువకుడు (27) కొలంబియా జర్నలిజం స్కూల్‌లో గ్రాడ్యుయే షన్ చదువుతున్నాడు. హర్లెమ్ లో ఓ ఆపార్ట్ మెంట్ లో ఫజిల్ ఖాన్ ప్లాట్‌కు సమీపంలో మంటల చెలరేగడం తో అతడు సజీవదహనమయ్యాడు. మంటలు పైఅంతస్థుల్లో ప్రారంభమయ్యాయని, కొందరు పైనుంచి కిందకు దూకారని స్థానికుడు అఖిల్ జోన్స్ తెలిపాడు. ఫజల్ ఖాన్ మృతి పట్ల న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. అతడి తల్లిదండ్రులతో భారత్ ఎంబసీ అధికారులు మాట్లాడడంతో పాటు భారత్‌కు ఫజల్ మృతదేహాన్ని పంపిస్తామని వెల్లడించారు.

Social Share Spread Message

Latest News