Namaste NRI

కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం

అమెరికాలోని క్యాలిఫోర్నియాలో చదువుతున్న సాకేత్ శ్రీనివాసయ్య అనే భారతీయ విద్యార్థి కనిపించకుండా పోయాడు. దీంతో ఐదు రోజులుగా అధికారులు ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు. కర్ణాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య (22), అమెరికా, క్యాలిఫోర్నియాలోని క్యాలిఫోర్నియా బర్కెలీ అనే యూనివర్సిటీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతడు ఈ నెల 9 నుంచి కనిపించకుండా పోయాడు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఇతర అధికారులు అతడి కోసం ఐదు రోజులుగా గాలిస్తున్నారు.

ముఖ్యంగా క్యాలిఫోర్నియా సిటీ మొత్తం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతున్నారు. చివరగా అతడు క్యాంపస్‌కు ఒక కిలోమీటర్ దూరంలో కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే క్యాంపస్‌కు దగ్గరలో ఉన్న టిల్డెన్ రీజనల్ పార్క్ దగ్గర ఉన్న ఒక ఇంటి వద్ద అతడి బ్యాక్‌ప్యాక్, పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్‌ను అధికారులు గుర్తించారు. మరోవైపు దగ్గరలోని లేక్ అంజాలో, అలాగే బర్కెలీ హిల్స్ ప్రాంతంలో కూడా గాలిస్తున్నారు. లేక్ ప్రాంతంలో ప్రత్యేక బోట్లతో అధికారులు గాలింపు చేపట్టారు. అతడి సన్నిహితులు అక్కడ ఆన్‌లైన్‌లో కూడా అతడి కోసం వెతుకులాట ప్రారంభించారు. తన వివరాలు పోస్ట్ చేస్తూ, అతడిని చూసిన వారు సమాచారం అందించాలని కోరారు.

సాకేత్ మిస్సింగ్ అంశంపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులత సమన్వయం చేసుకుంటూ అతడిని వెతికేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు అతడి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందిస్తున్నామని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events