సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లేన్ ప్రోగ్రామ్ జాబితాలోకి భారత్‌ను చేర్చింది. ఇందులో భాగంగా నవంబర్ 29 నుంచి గుర్తింపు పొందిన వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో తీసుకున్న భారత ప్రయాణికులు ఇకపై క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. సింగపూర్ మంత్రి మాట్లాడుతూ చెన్నై, ఢల్లీి, ముంబై నగరాలకు ప్రతి రోజు రెండు వీటీఎల్ విమానాలను నడిపేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. చర్చలు ముగిసిన తర్వాత సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ సింగపూర్ (సీఏఎఎస్) దీనిపై మరింత సమాచారాన్ని వెల్లడిస్తుందని పేర్కొన్నారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రయాణికులపై సింగపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆంక్షలను ఎత్తేసేందుకు భారత ప్రభుత్వం సింగపూర్‌తో చాలా రోజులుగా చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.














