ఎలాన్‌మస్క్ ట్విట్టర్ బ్రాండ్‌కు ఇండోనేషియా ప్రభుత్వం చెక్‌పెట్టింది. మస్క్‌కు చెందిన ఎక్స్ డొమైన్‌ను బ్లాక్ చేసింది. ఆన్‌లైన్ అశ్లిలత, జూదాన్ని నిషేధించే కఠినమైన చట్టాల కారణంగా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ తాత్కాలికంగా నిలిపివేయ బడింది. ఇండోనేషియా కమ్యూనికేషన్-ఇన్ఫర్మేటిక్స్ మంత్రిత్వ శాఖ ప్రకారం అశ్లిలత- జూదం వంటి ప్రతికూల కంటెంట్‌కు వ్యతిరేకంగా చట్టాలకు కట్టుబడి ఉండని సైట్‌ల ద్వారా ఈ డొమైన్ గతంలో ఉపయోగించ బడిందని అల్ జజీరా నివేదించింది. మంత్రిత్వ శాఖలోని ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ కమ్యూనికేషన్ డైరెక్టర్ జనరల్ ఉస్మాన్ కాన్సోంగ్ మాట్లాడుతూ వెబ్‌సైట్ స్వభావంపై స్పష్టత పొందడానికి ప్రభుత్వం ట్విట్టర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోందని, సమగ్ర వివరణలతో వారు మాకు లేఖ పంపుతారని కాన్సాంగ్ పేర్కొన్నారు.