అగ్రరాజ్యం అమెరికాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారు. ఏకంగా కోట్ల రూపాయలు కొలగొట్టారు. వారెవరో కాదు భారతీయ సంతతికి చెందిన తెలుగు టెకీలు. దీంతో క్షేత్ర స్థాయిలో విచారించిన ఫెడరల్ అధికారులు ఏడుగురిపై అభియోగాలు నమోదు చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా మిలియన్ డాలర్ల లాభం పొందినట్టు దర్యాప్తులో స్పష్టమైంది. ఈ ట్రేడిరగ్ ద్వారా రూ.7.5 కోట్లు అర్జించినట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు. అయితే ఈ మోసం రెండేళ్ల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్జైంజ్ మిషన్ (ఎస్‌ఈసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హరిప్రసాద్ సూరే(34), లోకేశ్ లగుడు(31), చోటు ప్రభుతేజ్ పులగం (29)లు స్నేహితులు. వీరంతా సాంకేతిక రంగంలో ఆరితేరిన వారు.
శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ కమ్యూనికేషన్ కంపెనీ ట్విలియోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. 2020లో హరిప్రసాద్ ట్విలియో కంపెనీ భవిష్యత్తు ప్రణాళిక రహస్య సమాచారాన్ని మిత్రుడు దిలీప్ రెడ్డికి చేరవేశాడు. అలాగే లోకేశ్ కూడా తన గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు మరో స్నేహితుడు అభిషేక్‌కు కంపెనీ విషయాలు తెలిపారు. ప్రభుతేజ్ తన సోదరుడు చేతన్ ప్రభుకు కూడా ఈ విషయాలను వెల్లడిరచాడు. కంపెనీ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండబోతున్నాయని ముందుగానే తెలుసుకొన్నారు. అలా ఫలితాల ప్రకటన వచ్చే ముందే బ్రోకరేజ్ ఖాతాల ద్వారా ట్విలియో ఆప్షన్లు, స్టాక్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 2020 మే 6న ట్విలియా త్రైమాసిక ఫలితాలను వెల్లడిరచడం, కంపెనీ షేర్లు పెరుగడం చకచకా జరిగిపోయాయి. అనుమానం వచ్చిన సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ ఆరా తీయగా మోసం బయటపడిరది.














