జర్మనీలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొనడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ 7 సదస్సులో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రొటోకాల్‌ను పక్కన బెట్టారు. ప్రధాని మోదీ వద్దకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చి పలకరించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో మోదీ మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెనుక నుంచి వచ్చిన బైడెన్ బీజిగా ఉన్న మోదీ భజాన్ని తట్టి మరీ పలకరించారు. ఆ సమయంలో మోదీ వెనక్కి తిరిగి చూసి బైడెన్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఇద్దరూ పరస్పరం మాట్లాడుకున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)