Namaste NRI

మేరీల్యాండ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృదినోత్సవ వేడుకలు

అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మేరీల్యాండ్ ఏరియాలోని ఫ్రెడెరిక్స్ లోని ఉన్న ఓక్డేల్ మిడిల్ స్కూల్లో  ఉమెన్  ఎంపవర్‌మెంట్ తెలుగు సంఘం(WETA) ఆధ్వర్యంలో 18న అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేరీల్యాండ్ సిటి కౌన్సిల్ సభ్యురాలు రెనీ నాప్, మేరీల్యాండ్ ప్రభుత్వ ప్రతినిధి వైసీలా బ్రావొలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంస్థ వ్యవస్థాపకురాలు ఝాన్సీరెడ్డి, అధ్యక్షురాలు శైలజ కల్లూరి, WETA మేరీల్యాండ్ నుండి ప్రీతిరెడ్డి, టెక్సస్ నుండి ప్రతిమరెడ్డి, కల్చరల్ చైర్ చైతన్య పోలోజు, రీజినల్ కోఆర్డినేటర్ స్వరూప సింగరాజు, మీడియా చైర్ సుగుణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రావ్య మానస వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

జీవితంలోని అన్ని కష్టాల నుండి మనల్ని కాపాడే రక్షణ కవచం లాంటిది తల్లి అని ఝాన్సీరెడ్డి అన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను WETA ఆధ్వర్యంలో పెంపొందిస్తామని తెలిపారు. వక్తలు మాట్లాడుతూ అమ్మ అనే పదంలో షరతులు లేని కరుణ, ప్రేమ, ధైర్యం, దయ ఇమిడి ఉంటాయని, సమాజంలో మహిళల పాత్రపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. అనంతరం రెనీ నాప్, వైసీలా బ్రావోలకు సేవా పురస్కారాలు అందించారు. స్థానిక నృత్య, సంగీత పాఠశాలల విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బహుమతులను ప్రదానం చేశారు. గాయనీ అంజనా సౌమ్య పాటలతో ప్రేక్షకులను అలరించారు.

వైభవంగా మదర్స్‌డే వేడుకల్ని నిర్వహించినందుకు ప్రెసిడెంట్‌ శైలజ కల్లూరి, లోకల్‌ వేట బృందం మేరీల్యాండ్‌ వేట-బీవోడీ ప్రీతిరెడ్డి, టెక్సాస్‌ బీవోడీ ప్రతిమ రెడ్డి, డీఎంవీ కల్చరల్‌ చైర్‌ చైతన్య పోలోజు, రీజనల్‌ కో ఆర్డినేటర్‌ స్వరూప సింగరాజు, మీడియా చైర్‌ సుగుణ రెడ్డి, వాలంటీర్స్‌ గురుచరణ్‌ చిట్నా, మోహన్‌ పులిచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్థానిక స్పాన్సర్లు భాస్కర్‌ గంటి, అరుణ్‌ ఎరువ, చంద్రలకు మెమెంటోలను బహుకరిస్తూ వారి సహాయ సహకారాలను కొనియాడారు. ఈసారి పెద్ద ఎత్తున హైస్కూల్‌, యువ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని ఈ వేడుక దిగ్విజయానికి దోహదపడ్డారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events