ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం పంపారు. రష్యా దాడి వల్ల తీవ్ర నష్టం జరిగింది, ఆ ప్రాంతాలను విజిట్ చేసే క్రమంలో తమ దేశానికి రావాలని మాక్రన్‌కు జెలెన్‌స్కీ వెల్కమ్ పలికారు. రష్యా నరమేధానికి పాల్పడుతోందని జెలెన్‌స్కీ ఆరోపించారు. మారియపోల్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నగరంలో చిక్కుకున్న వారి కోసం మూవ్‌మెంట్ పాసులను రష్యా జారీ చేసింది. ఈ పాసులు ఉంటేనే ఇతర ప్రాంతాలకు వెళ్లే వీలు ఉంటుంది. లుహాన్‌స్కీ ప్రాంతం ప్రజలు కూడా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ఉక్రెయిన్ అధికారులు కోరారు.














