మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయిల్ ఉచ్చులో పడిపోవద్దు అని ఆ వార్నింగ్‌లో తెలిపింది. సిరియాలో ఉన్న ఇరాన్ కౌన్సులేట్‌పై ఇజ్రాయిల్ అటాక్ చేసింది. దీంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. అయితే ఈ అంశంలో తాము చర్య తీసుకోబోనున్న నేపథ్యంలో జోక్యం చేసుకోవద్దు అని అమెరికాను ఇరాన్ కోరింది. దీని పై ఇరాన్ పొలిటికల్ అఫైర్స్ చీఫ్ జామ్‌సిది ప్రకటన చేశారు. నెతన్యహూ వేసిన ఉచ్చులో పడిపోవద్దు అని జామ్‌సిది తన ప్రకటనలో తెలిపారు. అయితే ఇప్పటి వరకు అమెరికా మాత్రం ఇరాన్ వార్నింగ్ గురించి ఎటు వంటి ప్రకటన చేయలేదు. కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు స్పష్టం అవుతోంది.