
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంలో పురోగతి కనిపించకపోతే, చర్చల ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మానుకుంటారని ఆ దేశ విదేశాంగ మంత్రి రుబియో స్పష్టంచేశారు. మరికొద్ది వారాల్లో ఇది సాధ్యమవుతుందా? లేదా? సాధ్యమైతే మేం ఉంటాం, లేదంటే, మేం దృష్టి పెట్టవలసిన ఇతర ముఖ్య విషయాలు ఉన్నాయి అని పారిస్‌లో యూరోపియన్, ఉక్రెయినియన్ నేతలతో సమావేశం అనంతరం చెప్పారు. ఒప్పందంలో పురోగతి కనిపించకపోతే, ఇక విరమించుకోవాలని ట్రంప్ అనుకుంటున్నారని తెలిపారు.
