బ్రిటన్‌లో అమలులో ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేయడం ద్వారా బ్రిటన్‌కు తీవ్రమైన ముప్పుగా పరిణమించిన ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అణచివేస్తానని ప్రధానమంత్రి అభ్యర్థి రిషి సునాక్ తెలిపారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల ఓట్ల కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో రిషి మాట్లాడారు. బ్రిటన్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సంస్థలను సమూలంగా పెకలిస్తానని అన్నారు. ప్రధాని రేసులో తన ప్రత్యర్థి అయిన విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌తో పోటీ పడుతున్న రిషి సునాక్. కాగా తాజాగా విడుదలైన ఓ సర్వే ప్రకారం లిజ్ ట్రస్ మళ్లీ విస్తృత అధిక్యంలోకి వచ్చారు. ది టైమ్స్ నిర్వహించిన యూగవ్ పోల్ సర్వేలో ఆమె 38 పాయింట్లకు మెరుగుపరచుకొని 69 శాతం ఆధిక్యతతో ఉన్నారు. రిషి సునాక్‌కు 31 శాతం మద్దతు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.














