లెబానన్‌పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. 21 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని అగ్రదేశాలు అమెరికా, బ్రిటన్ కోరినా, వెనక్కి తగ్గేది లేదని ఇజ్రాయిల్ పేర్కొన్నది. అన్ని దళాలు పూర్తి స్థాయిలో ఫైటింగ్ చేస్తున్నాయని ఇజ్రాయిల్ మిలిటరీ తెలిపింది. పోరాటాన్ని ఆపవద్దు అని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యూ ఆదేశించారు. ఇజ్రాయిల్ మిలిటరీ దళాలు దక్షిణ లెబనాన్‌లో సుమారు 75 హిజ్‌బొల్లా టార్గెట్లను పేల్చివేసినట్లు తెలుస్తోంది. తాజా దాడుల్లో సుమారు 13 మంది మరణించినట్లు లెబనీస్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇజ్రాయిల్, హిజ్‌బొల్లా మధ్య గత కొన్ని రోజుల నుంచి రోజూ సరిహద్దు కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.