Namaste NRI

ఐటీ ఉద్యోగులు పొరపాటున కూడా.. ఇలా చేయొద్దు

సంస్థ స‌మాచారాన్ని లీక్ చేసిన 20 మంది ఉద్యోగుల్ని మెటా  కంపెనీ తొల‌గించింది. ఆ ఉద్యోగులు ర‌హ‌స్య స‌మాచారాన్ని లీక్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వాళ్లు ఏ ఉద్దేశంతో స‌మాచారం లీక్ చేసినా,  త‌మ విధానాల‌కు విరుద్ధ‌మ‌ని మెటా సంస్థ ప్ర‌తినిధి పేర్కొన్నారు. ఇటీవ‌ల కంపెనీలో ఓ ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని, దాంట్లో 20 మంది ఉద్యోగులు దోషులుగా తేలార‌ని, వాళ్లు కంపెనీ ర‌హ‌స్య స‌మాచారాన్ని బ‌య‌ట‌కు చేర‌వేస్తున్న‌ట్లు తెలిసింద‌ని ఆ ప్ర‌తినిధి చెప్పారు. త్వ‌ర‌లో మ‌రికొంత మంది కూడా ఉద్యోగాలు కోల్పోయే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

సంస్థ స‌మాచారాన్ని లీక్ చేసే అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటామ‌ని, లీక్‌లు జ‌రుగుతున్న‌ట్లు గుర్తించిన‌ప్పుడ‌ల్లా ఇలాంటి చ‌ర్య‌లు ఉంటాయ‌ని అన్నారు. ఇటీవ‌ల ఉద్యోగుల‌తో జుక‌ర్‌బ‌ర్గ్ నిర్వ‌హించిన వ‌రుస మీటింగ్‌ల త‌ర్వాత ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ప్ర‌స్తుతం అమెరికాలోని ట్రంప్ స‌ర్కారుకు అనుకూలంగా మెటా కంపెనీ త‌న ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్న‌ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events