Namaste NRI

ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది: దర్శకుడు హరీశ్‌శంకర్‌

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రం. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్‌శంకర్‌ మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. నేను రికార్డులను మనసులో పెట్టుకోలేదు. ఎందుకంటే కలెక్షన్స్‌ ఎప్పుడూ విడుదల తేదీపై ఆధారపడి ఉంటాయి. సంక్రాంతికి ఓరకంగా, సమ్మర్‌లో మరోరకంగా ఉంటాయి. అయితే ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది అని అందరూ అనుకుంటారు అన్నారు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేసేలా అన్ని హంగులతో ఈ సినిమాను తీర్చిదిద్దామని ఆయన చెప్పారు.

నిర్మాత నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలన్నది మా కల. అది ఉస్తాద్‌ భగత్‌సింగ్‌తో నెరవేరింది. ఈ సినిమా టికెట్‌ రేట్లు పెంచలేదు. మామూలు రేట్లకు ఎంత వసూళ్లు వస్తాయో చూద్దామని ఆ ప్రయత్నం చేయలేదు. పవన్‌కల్యాణ్‌ ఈ సినిమా కోసం ఒక్కోసారి 15 గంటలు కూడా కష్టపడ్డారు. గురువారం ఉదయం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌షోలు ప్రారంభమవుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయికలు శ్రీలీల, రాశీఖన్నా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events