ఈ భూ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి. ఎన్నో విచిత్రాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇప్పటికీ మనకు ఎన్నో తెలియనివి దాగి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎక్కువగా వర్షాలు కురిసేది మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామంలోనే. కానీ ఇంత వరకు వర్షం కురవని ప్రదేశం కూడా ఉంది. వివరాల్లోకి వెళితే.. ఆ గ్రామం పేరు అల్ హుతైబ్. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంటుంది. కాగా ఈ గ్రామం భూమికి 3200 మీటర్ల ఎత్తులో ఉన్న ఓ కొండపై ఉంది.
మేఘాల కంటే ఎత్తులో ఆ గ్రామం ఉన్నదన్న మాట. మేఘాల కంటే ఎత్తులో ఉండటం వలన ఈ ప్రాంతంలో వర్షాలు కురవడం లేదు. అక్కడ వాతావరణ విషయానికికొస్తే ఉదయం పూట ఎండ, రాత్రి సమయం చలిగా ఉంటుంది. అక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా ఆ వాతావరణం అలవాటే. వర్షం పడకపోతే, గ్రామస్తులకు ఇబ్బంది ఉండదా అనే సందేహం రావొచ్చు. అలాంటిదేమీ లేదు. ఈ కొండ కిందనే పంట పొలాలు ఉన్నాయి. కొండపైనున్న గ్రామస్తుల నీటి అవసరాలకు ప్రభుత్వం వాహనాల ద్వారా మంచినీటిని చేరవేస్తున్నది. కాగా ఆ వింత ప్రాంతాన్ని చూసేందుకు టూరిస్టులు తాకిడి బాగానే ఉంటుందట.
……………….