మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా అధ్యక్ష ఎన్నికల్లో రోజురోజుకీ ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. మా ఎన్నికలు, శాశ్వత భవన నిర్మాణం గురించి బండ్ల గణేశ్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మా కు శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం లేదన్నారు. మా లో దాదాపు 900 మంది వరకు సభ్యులు ఉన్నారని వారిలో 150 మంది వరకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బండ్ల గణేశ్ అన్నారు. మా కు సొంత భవనం కట్టేందుకు అవసరమయ్యే రూ.20 కోట్ల ఖర్చుతో పేద ఆర్టిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వొచ్చని ఆయన పేర్కొన్నారు.
మా కు సొంత భవనం లేనందువల్ల చిత్ర పరిశ్రమకు వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. ఏదీ ఆగిపోదని అన్నారు. మాకు సొంత బిల్డిండ్ నిర్మాణానికి తాను వ్యతిరేకం అని బండ్ల గణేశ్ ఉద్ఘాటించారు. బండ్ల గణేశ్ మా ఎన్నికల తరుణంలో ప్రకాశ్ రాజ్ వర్గానికి మద్దతు పలుకుతున్నారు. మా ను ఆయన మరింత ముందుకు తీసుకెళతాడన్న నమ్మకం ఉందని తెలిపారు.