
ఖతార్ రాజధాని దోహా లో హమాస్ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం గత వారం భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఖతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్ర దేశమని చెప్పారు. ఖతార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. నెతన్యాహు ఖతార్ విషయంలో జాగ్రత్త. అది అమెరికాకు చాలా ముఖ్యమైన మిత్రదేశం. హమాస్‌పై ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఖతార్ జోలికి మాత్రం వెళ్లొద్దు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అని హెచ్చరించారు.
















