Namaste NRI

మానవ గాత్రంతోనే అది సాధ్యం :  రమణ గోగుల

వెంకటేష్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సందర్భం గా  స్వరకర్తగా, గాయకుడు రమణ గోగుల పాత్రికేయులతో ముచ్చటిస్తూ నేను యూఎస్‌లో ఉంటున్నా. వ్యక్తిగత జీవితంలో బిజీ కావడం వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్‌ కాల్‌ చేసి తప్పకుండా పాట పాడాలని కోరాడు. సాంగ్‌ పంపిస్తే రెండుసార్లు విన్నా. చాలా బాగా నచ్చింది. అందులో కొత్తదనంతో పాటు మంచి ఫీల్‌ ఉందనిపించింది. దాంతో తప్పకుండా పాడాలని నిర్ణయించుకున్నా అన్నారు. చాలా మంది ఫోన్‌ చేసి పాట బాగుందని, వాయిస్‌లో అదే మ్యాజిక్‌ ఉందని పొగడటం ఆనందంగా ఉందని, వెంకటేష్‌ కూడా ఫోన్‌ చేసి పాట గురించి మెచ్చుకున్నారని రమణ గోగుల తెలిపారు.

 మళ్లీ మ్యూజిక్‌ డైరెక్షన్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తన వద్ద వినూత్నమైన ఐడియాస్‌ ఉన్నాయని, మంచి కథ, దర్శకుడు కాంబినేషన్‌ సెట్‌ అయితే తప్పకుండా కంపోజింగ్‌కు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ వల్ల మ్యూజిక్‌ కంపోజింగ్‌లో మార్పులొచ్చాయని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో సింగర్‌ అవసరం లేకుండా పాటను తయారుచేయొచ్చని, అయితే పాట తాలూకు ఆత్మ ఆవిష్కృతం కావాలంటే మావన గాత్రంతోనే సాధ్యమని రమణ గోగుల అభిప్రాయపడ్డారు. విదేశాల్లో మల్టీనేషనల్‌ కంపెనీల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డాటా ఎనలిటిక్స్‌ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉండటం వల్ల సినిమాలకు గ్యాప్‌ వచ్చిందని ఆయన వివరించారు.  ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News