
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కుబేర. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఫస్ట్‌గ్లింప్స్‌ను ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగార్జున సోఫాలో కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. సమాజంలోని ఆర్థిక అసమానతలు, డబ్బు పట్ల లోకం దృక్కోణాన్ని ఆవిష్కరిస్తూ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. అంతర్లీనంగా ఆయన శైలి సందేశం ప్రధానాంశంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరకర్త.
