దుబాయ్‌లో నిర్వహించిన మహజూబ్ వీక్లీ డ్రాలో ఓ భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. ఈ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన అక్షయ్ ఎరియకడన్ అరవిందన్(22) అనే భారత యువకుడు ఏకంగా ఒక కేజీ బంగారం గెలుచుకున్నారు. కేరళకు చెందిన అక్షయ్ ఉపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఒక గ్యాస్ ఏజెన్సీలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అలా వచ్చిన సంపాదనతో స్వదేశంలో తనకు ఉన్న అప్పులు, కుటుంబ అవసరాలకు తీరుస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో స్నేహితుల సూచన మేరకు ఇటీవల మహజూబ్ 54వ వీక్లీ డ్రాలో టికెట్ కొనుగోలు చేశారు. తాజాగా దుబాయ్‌లో మహజూబ్ లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో అక్షయ్ విజేతగా నిలిచారు. దీంతో ఒక కిలో బంగారు గెలుచుకున్నారు.